వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ… మన పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం. కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం. అదే పార్టీ రాజ్యాంగం అని పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు అన్నారు. వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా… పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలి. ప్రజలందరి భాగస్వామ్యం మనకు…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు.. ఈ నేపథ్యంలో… రేపు అన్ని జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.. రేపు ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ లో ఈ సమావేశం జరగనుండగా… జూలై 8న పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం,…
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా తెలంగాణ వైయస్సార్ అభిమానులకు వైఎస్ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్…
తెలంగాణ సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్లకు ఆశపడి ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా కెసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. “ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల… ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో.. తన అనుచరుడితో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రర్ చేయించారు.. అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఓ ప్రకటన కూడా చేశారు.. మరోవైపు పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు.. తాజాగా, వైఎస్ షర్మిల ఆదేశానుసారం.. అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించినట్టు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. ఆ ప్రకటన ప్రకారం వైఎస్ఆర్‌టీపీ అధికార ప్రతినిధులుగా..…
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతరు వైఎస్ షర్మిల… మరోవైపు.. వివిధ జిల్లాల అనుచరులు, వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీక్షలు కూడా చేశారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరుపై ఓవైపు ప్రచారం జరుగుతున్నా.. సోషల్ మీడియాలో ఖాతాలో అదేపేరుతో దర్శనమిస్తున్నా.. పార్టీ పేరు ప్రకటించే…
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నేడు వైఎస్ షర్మిల పర్యటించనుంది. వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రాజు, మురళీల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వెల్దుర్తిలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలతో ఉదయం 7 గంటలకే వెల్దుర్తి రానుంది. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు పూర్తచేశారు. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల…
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా రేపు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. ఉదయం 6 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిల..మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎల్దుర్తి మండలంలోని అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉద్యోగం రావట్లేదని…
ఏప్రిల్ 9 వ తేదీన షర్మిల కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కోన్న సంగతి తెలిసిందే. పార్టీని ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులతో చర్చించారు. నాయకుల, వైఎస్ఆర్ అభిమానుల సలహాలు సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్ నెలలో పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తామని వైఎస్ షర్మిలా పేర్కోన్న సంగతి తెలిసిందే. ఇక, ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల రేపు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉద్యోగాలు లేక…