తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా…
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు… ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో.. ప్రతీ మంగళవారం దీక్ష చేస్తూ వస్తున్నారు.. అందులో భాగంగా… ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేయనున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హుజురాబాద్ నియోజర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇవాళ దీక్షకు కూర్చోనున్నారు.. సిరిసేడు గ్రామం…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… షర్మిల దీక్షపై స్పందించిన ఆయన.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయడం అర్ధ రహితం అన్నారు.. మీ నాన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. తన రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించులేక నిరుద్యోగ దీక్షలు చేపట్టారంటూ సెటైర్లు వేశారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం…