రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలని, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు.…