తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లాయా?, ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్తాయని, NABL తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో టెస్టులు కూడా పాస్ కావాలని, ఆ…
సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ 9 పేజీలతో కూడిన లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని, KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని పేర్కొన్నారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఈ…