మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ కాలనిలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. ఈ ముగ్గురు యువకులు గంజాయికి బానిసై సోనియాగాంధీ నగర్ కాలనిలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు.