పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. సాయికుమార్ జన్మదినం రోజే హత్య కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.