ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మాలపాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ప్రేమించిన యువతి బంధువులు తన ఇంటిపై రాత్రి దాడి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్‌లో చోటుచేసుకుంది.
ఓ యువకుడు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కర్ణాటకలోని చిత్రదుర్గలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు తన తాతను కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ కొనడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.