తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమని సీఎం తెలిపారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని,అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం హితవు పలికారు.ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు.. తీసుకురావల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా రంగానికి…
దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్‌ను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ నిన్న జీవో జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు..
CM Revanth Reddy : నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి , రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ కు, రూ.296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్…