యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు.