Israel: ఇజ్రాయిల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ‘యూనిట్ 8200’ చీఫ్ రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ సైన్యం గురువారం ప్రకటించింది. "8200 యూనిట్ కమాండర్, (బ్రిగేడియర్ జనరల్) యోస్సీ సారిల్, తన పదవినికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని తన కమాండర్లు మరియు సబార్డినేట్‌లకు తెలియజేసారు’’ అని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఆయన తన పదవిని ముగించనున్నట్లు పేర్కొంది.