CM Yogi: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్‌ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు.