CM Chandrababu : విశాఖ నగరం ఈ ఉదయం అద్భుత దృశ్యానికి వేదికైంది. అర్బన్ సముద్రతీరాన ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ యోగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగాసనాల ప్రదర్శన 45 నిమిషాలపాటు సాగనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతోపాటు స్థానికులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…