Yogaday Countdown : జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం రంగురంగుల తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా జూన్ 20న 24 గంటల ముందు కౌంట్‌డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారత్‌దే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ…
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది.
“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. "గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు…
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర.