నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్‌లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్…