తమిళ, మలయాళ భాషల్లో నటిగా చక్కని పేరు తెచ్చుకుంది సుమతీ జోసఫ్ ఉరఫ్ రేఖ. 1986లో సత్యరాజ్ సరసన రేఖ నటించిన ‘కడలోర కవితగళ్’ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తర్వాత కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలలోనూ నటించింది రేఖ. తమిళంలో అయితే దాదాపు అగ్ర కథానాయకులందరి చిత్రాలలోనూ చేసింది. కొన్నేళ్ళ క్రితం నటనకు విరామం చెప్పి విజయ్ టీవీలో రియాలిటీ షోస్, కుక్ విత్ క్లౌన్…