త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను…
కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానకారణమైన ముఖ్యమంత్రి యడ్డియూరప్ప ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి ముఖ్యమైన పదవుల్లో కొనసాగే అవకాశం లేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన యడ్డియూరప్ప విషయంలో ఇప్పటికే రెండేళ్లు ఆగింది. రెండేళ్ల క్రితం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో యడ్డియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల కాలంలో పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన రాజకీయ అనుభవంతో…