వైసీపీ నేత యాక్టర్ అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే యాక్టర్ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్ అన్నారు. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్…
విజయనగరం వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అనిల్ మృతి పట్ల జిల్లా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడైన అంబటి అనిల్ మృతి పట్ల వైసీపీ…