గ్రాఫ్ పడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేయడంతో.. గోదావరి జిల్లాల్లో ఆ అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుంది? ఎవరికి రాదు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు వైసీపీ శ్రేణులు కలిసినా ఇదే చర్చ. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలపై కొందరు వ్యతిరేక ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నారట. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో…