వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పేరుతో రైతులకు ఉరి వేస్తున్నారని విమర్శించారు. అసలు మీటర్లు పెట్టమెందుకు? వాటికి రైతులు డబ్బులు కట్టమెందుకు? తిరిగి మళ్ళీ రైతులకు చెల్లింపులు చేయడమెందుకు? అని ఆయన ప్రశ్నించారు. మీటర్లు వద్దని రైతులు మొత్తుకుంటున్నా.. పట్టు బట్టి మరీ మీటర్లు పెడుతున్నారని, అసలు అంత అవసరం ఏముందని అడిగారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకే జగన్…