తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో భేటీకానున్నారు.. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో చర్చించనున్న వైఎస్ జగన్..