ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మేలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలును ప్రజలకి వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ టూర్లపై కేబినెట్ భేటీలో చర్చించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. ఏపీ…