అధికారంలో ఉన్నంతకాలం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తానన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం నేను-నా బలగం అంటూ మరొకరికి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అదే నాయకుడు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవటం లేదు. ఇంతకీ…ఎవరా నాయకుడు?ఏంటా నియోజకవర్గం? పొలిటికల్ హైడ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దెందులూరు నియోజకవర్గానికి 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు కొఠారు అబ్బయ్య చౌదరి. ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని…