జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి... ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ... బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ... ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట.