కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన వైసీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్‌ఎంపీ డాక్టర్), సతీష్‌ను ఫోన్‌లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఘటన వివరాలు ఆరా తీశారు.
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి అని సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణులకు వైసీపీ కీలక సూచనలు చేసింది.. డైవర్షన్ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది..