నోట్ల కట్టల వ్యవహారం కేసు ఇంకా జస్టిస్ యశ్వంత్ వర్మను వెంటాడుతోంది. ఇక త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి.