పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యశోద హాస్పిటల్స్ గ్రూపు యాజమాన్యం. తమ మాతృభూమి అయిన మేడిపల్లి-రాంపూర్ గ్రామాల్లో రూ 1.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రంగా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్‌రావు, గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి దేవేందర్‌రావులు సొంతూరికి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.…
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. సమంత నటనకు వీక్షకులు సహా, విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో సమంత చేశారు. దాంతో సమంత పొటెన్షియల్…