ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ స్పందించారు. ఆ ప్రాజెక్ట్‌ను ప్రతిఒక్కరూ ఏటీఎంలానే చూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రులు వస్తున్నారు, పోతున్నారే తప్ప.. ఫోలవరంపై ఫోకస్ పెట్టడం లేదని ఆరోపించారు. పోలవరం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఏమీ తేల్చడం లేదని దుయ్యబట్టారు. పని పూర్తి చేస్తే కేంద్రం నిధులిస్తుందని, కానీ ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఏపీలో చెత్త తొలగించాలన్నా..…