ISRO to Launch PSLV-C58 Mission Today: న్యూఇయర్ వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58కి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవ్వగా.. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా మన…
విశ్వంలోని సుదూరాల నుంచి వచ్చే కాస్మిక్ ఎక్స్-తరంగాల ధ్రువణాలను అధ్యయనం చేయడానికి భారత్ తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇది అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్‌ని అధ్యయనం చేస్తుంది. విశ్వంలో ఉన్న సమస్యాత్మక రహస్యాలను ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.
ISRO Begins Countdown for PSLV-C58: 2023లో చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. మరో ప్రయోగానికి సిద్దమైంది. 2024 మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ను ఇస్రో…