గురుగ్రామ్‌లో కారు-బైక్ ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాంగ్ రూట్‌లో కారు రావడంతో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న బైకర్ ఢీకొని 23 ఏళ్ల అక్షత్ గార్గ్ ప్రాణాలు వదిలాడు. రాంగ్ సైడ్‌లో ఎస్‌యూవీ కారును నడిపిన వ్యక్తికి వెంటనే బెయిల్ లభించింది. దీంతో అతడికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటూ గురుగ్రామ్ ప్రమాద బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.