తెలుగు సినిమా రచయిత సత్యానంద్ ను చూడగానే, ఆయన ముఖంలో సరస్వతీ కళ కనిపిస్తుంది. అతిగా మాట్లాడరు. కానీ, ఆయన మాటలు మాత్రం జనం నోట చిందులు వేసేలా చేస్తుంటారు. చిత్రసీమలో ఎంతోమందికి సన్నిహితులు సత్యానంద్. ఎవరినీ నొప్పించరు. తన దరికి చేరిన అవకాశాలతో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సత్యానంద్ మాటల తూటాలు అంతగా పేల్చడం లేదు. కానీ, ఆయన కథలతో మాత్రం చిత్రాలు రూపొందుతున్నాయి. ఒకప్పుడు సత్యానంద్ రచన అనేది తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్…