Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు వారు లేఖ రాశారు.రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు నాలుగు డిమాండ్లు చేశారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. డబ్ల్యూఎఫ్‌ఐలో చాలా అవకతవకలు…