హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరింది. వినేష్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండగా, బజరంగ్ పునియా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. 'నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది' అని అమన్తో ప్రధాని అన్నారు.
అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది.
ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌కు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేశ్.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైంది. ఈ క్రమంలో.. వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. రజత పతకానికి వినేశ్ ఫొగాట్ అర్హురాలేనని అన్నారు.
ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఆసియా గేమ్స్ లో పాల్గొనటం లేదనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
WWE ఫేమ్ రెజ్లర్ కాళి ఇంట విషాదం నెలకొంది. కాళి తల్లి దలీప్ సింగ్ రాణా అనారోగ్యంతో మరణిచింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో లూధియానాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కాళి స్వస్థలం సర్‌మౌర్ జిల్లా ధిరానియా గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన దలీప్.. చిన్నతనంలో చదువుకు దూరమైన కూలీ పనులు చేశాడు. తన భారీ కాయాన్నే పొట్టకూటి కోసం…