ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
శివరాత్రి పర్వదినాన స్టార్ హీరోయిన్స్ తమన్నా,పూజ హెగ్డే శివుడు సేవలో లీనమయ్యారు.. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు కూడా హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న ఇషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకలో తమన్నా తో పాటు పూజ హెగ్డే కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని భక్తులకు అన్నప్రసాదం వడ్డించింది. భక్తులందరికి తమన్నా స్వయంగా వడ్డించిన వీడియో…