శివరాత్రి పర్వదినాన స్టార్ హీరోయిన్స్ తమన్నా,పూజ హెగ్డే శివుడు సేవలో లీనమయ్యారు.. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు కూడా హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న ఇషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకలో తమన్నా తో పాటు పూజ హెగ్డే కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని భక్తులకు అన్నప్రసాదం వడ్డించింది. భక్తులందరికి తమన్నా స్వయంగా వడ్డించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా సిప్లిసిటీ చూసి ఫ్యాన్స్ అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు.అందంగా ఉన్న ప్రతి అమ్మాయికి గుడ్ హార్ట్ ఉండదు, ఎంత పెద్ద స్టార్ అయినా దేవుడు ముందు అందరు సమానమే అని మరోసారి తమన్నా చాటిచెప్పారు. తమన్నాను ఇలా చూసి నెటిజన్లు సర్ప్రైజ్ అవుతున్నారు. భక్తులతో శివరాత్రి శుభకాంక్షలు చెబుతూ వారికి భక్తి, శ్రద్ధతో వడ్డిస్తున్న ఆమెపై సోషల్ మీడియా వేదకిగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా తమన్నాతో పాటు బుట్ట బొమ్మ పూజా హెగ్డే వారిద్దరు శివనామాన్ని జపిస్తూ భక్తిలో లీనమైన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నా శివుడి నామాన్ని భక్తితో బలంగా జపిస్తూ కనిపించింది.ఇక తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తమన్నా తెలుగులో ఓదెల 2 సీక్వెల్లో నటిస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు మూవీ ఇది. చివరిగా భోళా శంకర్ మూవీలో నటించని తమన్నా ఇప్పుడు ఓదెల 2తో సరికొత్త కంటెంట్ తో వస్తుంది. ఇందులో ఆమె ఇదివరకు ఎప్పుడు చూడని లుక్ లో కనిపించబోతుంది. నిన్న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. పూర్తిగా శివుడి భక్తురాలిగా తమన్నా కనిపించింది.. ఇందులో ఆమె కట్టు,బొట్టు ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాయి. పెద్ద జుట్టుతో నాగ సాధువులా కనిపిస్తోంది. ఒక చేతిలో సాధువు కర్ర, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని శివశక్తిలా దర్శనమిస్తోంది.