MSVG : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి రిలీజై, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. పండుగ పూట చిరంజీవి మార్క్ వినోదం తోడవ్వడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్…