సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజయాలతో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా…
శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా మొదటి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే భారీ విజయం సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మధురానుభూతిని మిగిల్చింది. అయితే శ్రీలంకపై ఘనవిజయం సాధించినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో భారత్‌ను పాకిస్థాన్ అధిగమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరడంతో ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్‌పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి…
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్-2లో సరికొత్త విధానానికి ICC ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. గత ఛాంపియన్‌షిప్‌లో ఒక సిరీసుకు 120 పాయింట్లు కేటాయించారు. రెండు మ్యాచులే ఉంటే… ఒక్కో మ్యాచుకు 60 వచ్చేవి. నాలుగు మ్యాచులుంటే కేవలం 30 పాయింట్లే లభించేవి. అయితే కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడంతో దీనిని మధ్యలోనే మార్చేశారు. పర్సంటేజీ విధానం…
ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్‌ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్‌లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన…