పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.
WTC 2023-2025 Points Table Update: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్‌కు దూసుకొచ్చింది. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో భారత్‌ను వెనక్కినెట్టి మరీ.. తొలి స్థానాన్ని (56.25) దక్కించుకుంది. నాలుగో స్ధానం నుంచి ఏకంగా టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. పట్టికలో భారత్…