WTC 2023-2025 Points Table Update: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్‌కు దూసుకొచ్చింది. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో భారత్‌ను వెనక్కినెట్టి మరీ.. తొలి స్థానాన్ని (56.25) దక్కించుకుంది. నాలుగో స్ధానం నుంచి ఏకంగా టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది.
Also Read: David Warner: అభిమానులను అలరించడానికే నిత్యం ప్రయత్నించా.. వీడ్కోలు సందర్భంగా వార్నర్ భావోద్వేగం!
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో ఇప్పటివరకు 8 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 5 విజయాలు అందుకుని ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్ (54.16 శాతంతో) రెండో స్ధానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి తొలి స్ధానానికి చేరుకుంది. భారత్ తన టాప్ ప్లేస్‌ను ఒక రోజులోనే కోల్పోయింది. దక్షిణాఫ్రికా (50.0), న్యూజిలాండ్ (50.0), బంగ్లాదేశ్ (50.0), పాకిస్తాన్ (45.83) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.