మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన భాగం. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.