Gold and Silver Prices: సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతోన్న బంగారం, వెండి ధరలు నేడు పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో శుక్రవారం మార్కెట్లలో హడావుడి కనిపించింది. గురువారం వరకూ రికార్డు స్థాయిలను తాకిన ఈ ధరలు ఒక్కరోజులోనే దిశ మార్చుకోవడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. దేశీయ మార్కెట్, ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ మూడు శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. బంగారం ధర దాదాపు ఒకటిన్నర శాతం…