కరోనా మహమ్మారి తర్వాత, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ గణనీయంగా పెరిగింది. ఇప్పటికీ చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతిస్తున్నాయి.
కరోనా ఒక వైపు వీరవిహారం చేస్తున్నా ఉద్యోగ నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనబడుతోంది. 2021 ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకూ జరిగిన నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనిపించింది. గత ఏడాది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి జూన్ వరకూ జరిగిన నియామకాలతో పోలిస్తే వృద్ధిరేటులో పురోగతి కనిపించింది. ఇండీడ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2021 ప్రథమార్థంలో ఉద్యోగాల కల్పన 44 శాతం జరిగితే ద్వితీయార్థంలో మాత్రం అది 53…