Women's IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది.