Woman Fire in Texas Megachurch: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. టెక్సాస్ హూస్టన్‌లో ఉన్న మెగాచర్చిలో ఆదివారం ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వేంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు, 57 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం… స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడితో ఓ మహిళ లాక్‌వుడ్…
గుండెపోటుకు గురైన మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం పోసారు ఎస్సై మహేందర్ లాల్. ఈ ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వలిగొండ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీలు చేస్తూ విధులు నిర్వహిస్తుండగా.. అదే దారి గుండా వెళ్తున్న వలిగొండ మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ వెంటనే అక్కడికి చేరుకొని ఆలస్యం చేయకుండ మహిళకు…
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిపర్తి పంచాయితీ కాశీపురం గ్రామంలో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
తనతో మాట్లాడటం మానేసిన మహిళ ఫ్లాట్‌కు నిప్పంటించాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కాగా.. ఆ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ ధకేటా (32) అనే మహిళ ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బర్త్ డే పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడ్డాడని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కెపి యాదవ్ తెలిపారు.
Film Nagar: ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా వివాహతను ప్రేమించి ఇబ్బందులకు గురిచేశాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. అయితే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్విరా లండ్‌గ్రెన్ చలితో వణుకుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్విరా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు ఎల్విరా చుట్టూ మంచు పర్వతం ఉన్నట్లు చూడవచ్చు. ఎల్విరా తన తడి…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, పరిగెత్తేలా చేసి కొట్టారు. అంతేకాకుండా.. గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలో ఓ పోలీసు అధికారి మహిళతో కలిసి డ్యాన్స్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ముంబై లోకల్ ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా SF గుప్తా అనే పోలీసు అధికారిని పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిసెంబరు 6న రాత్రి 10:00…
మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న…