చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది.. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు, బాధితురాలి పిల్లలు చదువుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రూ.5లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతాను అని ప్రకటించారు.
కుప్పంలో జరిగిన ఓ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది.. అయితే, నేరుగా బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీడీపీ స్థానిక లీడర్‌కు ఫోన్ చేసిన ఆయన.. బాధితురాలి దగ్గరకు వెళ్లిన తర్వాత.. ఆమెతో మాట్లాడారు.. ఎట్టిపరిస్థితిలోనూ నిందితులకు వదిలిపెట్టనని.. తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు చంద్రబాబు.
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు…
కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా...? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు…