ప్రజల భద్రత కోసం విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక మహిళపై చేయి చేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని అంజలి చార్ రస్తా వద్ద ఈ సంఘటన జరిగింది. వాహన తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఒక మహిళను ఆపారు. ఆమె డ్రైవింగ్ లైసెన్స్ చూపాలని కోరగా,…