Rapido: బెంగళూర్‌లో ఒక మహిళపై ర్యాపిడో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాపిడో ఆటో రిక్షా డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 8న నగరంలోని దయానంద సాగర్ కాలేజ్ సమీపంలోని కుమారస్వామి లే అవుట్ నుంచి రాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మహిళను పికప్ చేసుకుని సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఆమె…
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర…
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశాన్ని ప్రస్తావించారు.