దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది.…