ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భయంతో ప్రజలు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. తోడేళ్లు ఎప్పుడు, ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఈ నరమాంస భక్షకుల దాడిలో ఇప్పటివరకు 9 మంది చిన్నారులు సహా 10 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.