Wolf Attack: ఉత్తర్ ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ తోడేళ్ల దాడుల వల్ల బహ్రైచ్ జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. నరమాసానికి మరిగిన తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి, 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ, ఈ దాడులను అడ్డుకట్ట పడటం లేదు.