ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ సంస్థ తమ శతసంవత్సరం సందర్భంగా ‘విష్’ అనే యానిమేటెడ్ మూవీని రూపొందించింది. ‘విష్’ టీజర్ ను గురువారం విడుదల చేయగా, ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ సాగుతోంది. ఈ టీజర్ లో ఆశ తన గొర్రెపిల్లతో కలసి అడవిలోకి వెళ్ళడం, అక్కడ ఆకాశంలోని ఓ తారను చూసి మనసులో ఓ కోరిక కోరుకోవడం కనిపిస్తుంది. తన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, దుష్టుడైన రాజు కబంద హస్తాల నుండి వారిని రక్షించమని ఆశ కోరుకుంటుంది. ఆ…